calender_icon.png 3 March, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులకు సన్మానం

03-03-2025 01:23:42 AM

పూర్వ విద్యార్థుల సుజాతనగర్ పాఠశాల అర్థశత సంవత్సర వేడుకలు 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2 (విజయక్రాంతి): గురుబ్రహ్మ ..గురువిష్ణు... గురుసాక్షాత్ పరబ్రహ్మ అనే నానుడిని సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆచరణలో నిరూపించారు. 1975 సంవత్సరంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులు ఆదివారం కొత్తగూడెం లేపాక్షి హోటల్లో అర్థశాత సంవత్సర స్వర్ణోత్సవాల వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు.

50 ఏళ్ల క్రితం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరినీ ఒకే వేదికపై కలిపి, వారి సేవలను మననం చేసుకొని, సన్మానించి ఆశీర్వాదం పొందారు. 1975లో పదవ తరగతిలో 18 విద్యార్థులు విద్యానభ్యసించారు. వారిలో ముగ్గురు కాలం చేయగా, మిగిలిన 15 మంది పూర్వ విద్యార్థులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన అనంతరం, విద్యను బోధించిన ఉపాధ్యాయులను సత్కరించటం ప్రతి ఒక్కరి మనసును చలింప చేసింది.

ఆనాటి ఉపాధ్యాయులంతా 80 సంవత్సరాల పైబడిన వారు కాగా, పూర్వ విద్యార్థులంతా 60 సంవత్సరాల పైబడిన వారీ వేదిక కావటం ఆశ్చర్యం కలిగించింది. పూర్వ విద్యార్థులు ఉపా ధ్యాయ సేవలను గుర్తించడమే కాకుండా, విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉండేందుకు బహుమతులు ప్రకటించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయుడి పేరుతో కొంత సొమ్మును డిపాజిట్ చేసి, డిపాజిట్ చేసిన పైకం నుంచి వచ్చే వడ్డీని ప్రతి ఏటా ఆ పాఠశాలలో పదో తరగతి చదువుతూ మొదటి రెండవ స్థానాల్లో మార్పులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకు బహుమతులు అందించడం, తన స్నేహితులలో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వారికి సహాయం అందించేందుకు తీర్మానించారు.

నంతరం తెలుగు మాస్టార్లు హనుమంత ఆచార్యులు, సీతారావమ్మ, గణితం మాస్టార్లు కేస్ రెడ్డి, కృష్ణమూర్తి, సైన్సు ఉపాధ్యాయులు ప్రసాద్ రెడ్డి, సోషల్ ఉపాధ్యాయులు ప్రభాకర్ రావు, పి ఈ టి రామారావులను సతీసమేతంగా సన్మానిం చారు.  ఈ కార్యక్రమం విజయవంతానికి రిటైర్డ్ గెజిటెడ్ ఉపాధ్యాయుల పీవీకే ఉపేం దర్ క్రియాశీలక పాత్ర పోషించారు.   కొదమూరి శ్రీనివాసరావు, కే సురేష్ కుమార్ కే ప్రభాకర్‌రావు, ఎల్‌లక్ష్మి, జి సత్యనా రాయణ, కే వేణుగోపాల్ రామారావు, కృపా రాణి, జహ్రూనేసా బేగం, కే రమేష్, అబ్దుల్ హసీ,కృష్ణార్జునరావ్, కృష్ణయ్యలు పాల్గొన్నారు