ఆయన నుంచి ప్రేరణ పొందాలి: ఓయూ వీసీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి, దిగ్గజ చిత్ర దర్శకుడు, రచయిత శ్యామ్ బెనగల్‌కు ఓయూలో బుధవారం పలువురు ఘనంగా నివాళులర్పించారు. ఉస్మానియా యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జీ నరేశ్ రెడ్డి, ఓఎస్డీ ఎస్ జితేంద్ర కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా విశ్రాంత ఆచార్యులు కే స్టీవెన్‌సన్ మాట్లాడుతూ భారతీయ సినిమాకు శ్యామ్ బెనగల్ చేసిన సేవలు అసాధారణమని కొనియాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో జన్మించి, నిజాం కళాశాలలో చదివారన్నారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ శ్యామ్ బెనగల్ ఓయూ విద్యార్థి కావడం మనకెంతో గర్వకారణమన్నారు. ఆయన జీవితం నుంచి అనేక పాఠాలు నేర్చుకోవచ్చన్నారు.