calender_icon.png 15 January, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ కిష్టయ్యకు ఘనంగా నివాళి..

01-12-2024 08:19:36 PM

జిల్లా వ్యాప్తంగా ఆయన విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు

కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ మళిదశ ఉద్యమంలో తెలంగాణ సాధనకోసం ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య 15వ వర్థంతి సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పున్నరాజేశ్వర్, విట్టల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి రాష్ట్ర అగ్రో కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. జిల్లా వ్యాప్తంగా  ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అగ్రో కార్పొరేషన్ చైర్మన్‌కాసుల బాల్‌రాజు మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసమే ప్రాణాలర్పించిన ప్రజా వీరులను భవిష్యత్ తరాలకు తెలియజేయడానికి నిరంతరం కృషి చేయాలని కొరారు. అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతి జిల్లా కేంద్రంలో అమరులకు నివాళులు అర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొట్టు విట్టల్, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేశ్వర్, డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాద్రి, టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు బాలరాజు, టిడిపి నేత మహేష్,రమేష్, సత్యం, అల్లి మోహన్, నారెడ్డిపేట నారాయణ తదితరులు పాల్గొన్నారు.