ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల(NTR Death Anniversary Celebration)ను తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పార్టీకలతీతంగా శనివారం జరుపుకున్నారు. ఎక్కడికక్కడే ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించి, ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రేణుకాచౌదరి, బాలసాని లక్ష్మీనారాయణ, టిడిపి నేత కూరపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు చోట్ల అన్నదానాలు చేశారు.ఆస్పత్రుల్లో రోగులకు పాలు,పండ్లు పంపిణీ చేశారు.
మధిరలో బీఆర్‌ఎస్ నేతల నేతృత్వంలో...
మధిర నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్ నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా రామారావు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజాసేవలను కొనియాడారు.ఆయన పరిపాలన ఎంతో స్పూర్తిదాయకమన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సీనియర్ నాయకులు మొండితోక జయకర్, రావూరి శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.