29-03-2025 06:33:07 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా శాలువాలతో సత్కరించారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో పాల్గొన్న జిల్లాకు చెందిన ఫిజికల్ డైరెక్టర్స్ శ్రీమతి విజయలక్ష్మి, సి హెచ్ ఆనంద్, అదేవిధంగా జాతీయ స్థాయి సైక్లింగ్ కోచ్ గా ఎంపికై జాతీయ స్థాయి లో కోచింగ్ ఇచ్చిన శ్రీమతి మమత ఫిజికల్ డైరెక్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... క్రీడల్లో మన జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కీర్తి, ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని, క్రీడల వల్ల మానసికంగా దృడంగా తయారవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి చిర్ర రఘు తదితరులు పాల్గొన్నారు.