02-04-2025 12:00:00 AM
నిజామాబాద్ ఏప్రిల్ 1:(విజయ క్రాంతి) ఉగాది అండగా సందర్భంగా తెలుగు రాష్ట్రాల మిమిక్రీ కళాకారుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా జరిగింది. మిమిక్రీ కళాకారుల వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జె సి ఐ ఇండి యన్ జోన్ 12 సంయుక్తంగా నిర్వహించిన ఈ మిమిక్రీ మేళ కనుల పండుగగా సాగింది.గురుమాత మాతృమూర్తి శోభ వేణుమాధవ్. నేరెళ్ల శ్రీనాథ్ మావా అధ్యక్షులు జీవీఎన్ రాజు ఉపాధ్యక్షులు మిమిక్రీ శివారెడ్డి కార్యదర్శి రాకేష్ గార్ల సమన్వయంతో సీనియర్ జూనియర్ కళాకారులు ప్రదర్శనలు తమ ప్రదర్శనలు ఇచ్చారు.రవీంద్ర భారతి వేదికగా వారితోపాటు నిజామాబాద్ జిల్లా సీనియర్ మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ ఫేమ్ పోస్టల్ శంకర్ తన మిమిక్రీ ప్రదర్శనను రవీంద్ర భారతిలో ఇచ్చారు. సందర్భంగా సీనియర్ మిమిక్రీ కళాకారుడు మిమిక్రీ శంకర్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.