26-02-2025 12:00:00 AM
ఇంటర్నేషనల్ బౌద్ధ కాంక్లేవ్
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): ప్రముఖ పాత్రికేయులు, బుద్ధవనం మాజీ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యను నాగ్‌పూర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బౌద్ధ కాంక్లేవ్ 2025లో ఘనంగా సన్మానించారు. నాగ్‌పూర్‌లోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో సోమ, మంగళవారాల్లో ఇంటర్నేషనల్ బౌద్ధ కాంక్లేవ్ 2025 సమావేశం జరిగింది. బుద్ధవనం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గాను లక్ష్మయ్యకు ఇండోనేషియాకు చెందిన బౌద్ధ భిక్షువు మోక్కాచారా ప్రత్యేక అవార్డు అందించారు.