calender_icon.png 2 March, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ అమరవీరులకు నివాళి

01-03-2025 10:02:31 PM

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ల సాధనకై 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో అనేకమంది అమరులు పరోక్షంగా ప్రత్యక్షంగా  నేలకొరికారు. వారిని స్మరించుకోవడానికి మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవం భూమయ్య మాదిగ అధ్యక్షులు మాట్లాడుతూ... 2024 ఆగస్టు 1వ, తేదీన సుప్రీంకోర్టు దుర్మాసనం ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని తీర్పు ఇవ్వడం జరిగింది అందుకు మరొకసారి సుప్రీంకోర్టు ధర్మాసనానికి జాతి పక్షాన అభినందనలు తెలుపుతున్నాం,సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన, అతి తొందరలోనే నిండు అసెంబ్లీలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రం చేయకముందే చేస్తా అని నిండు అసెంబ్లీలో ప్రకటించి, వర్గీకరణను ఏబీసీలుగా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ  ఎంతో కృషి చేశారు. అందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ అందులో లోపాలు ఉన్నాయి కాబట్టి, మరోసారి అధ్యయనం చేయడానికి, ముందుకు పొడిగించింది ప్రభుత్వం. ఈసారి వచ్చే నివేదికలో తప్పులు లేకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా, చూసి వర్గీకరణకు చట్టం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మన్నారు.

ప్రస్తుత ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్న మంత్రివర్గంలో మాదిగలకు స్థానం లేకపోవడం బాధాకరమైన విషయం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మాదిగలకు పూర్తిస్థాయిలో దక్కాల్సిన రాజకీయ స్థానం, మరియు రిజర్వేషన్ శాతం దక్కలేదు  దక్కలేదు. జనాభా దామాషా ప్రకారం కానీ ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్ టికెట్ల లో కానీ కాంగ్రేస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని  స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల అభివృద్ధిపై చిత్తశుద్ధి చాటుకోవాలనుకుంటే మాదిగలకు మంత్రివర్గ విస్తరణలో రెండు స్థానాలు కేటాయించాలి  అవసరమైతే విద్యాశాఖ మంత్రి పదవిని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పదవిని మాదిగలకు కేటాయించాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా అత్యధిక నిధులు కేటాయించాలి .అదేవిధంగా మాదిగ విద్యార్థుల కోసం  విదేశీ విద్య  ద్వారా అధిక నిధులు ఇవ్వాలి. అని తెలిపారు.మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు రవీందర్ మాదిగ మలికి సాయన్న అంబయ్య బాలయ్య సార్ మైసయ్య సాయిలు గంగారం నర్సింలు రాములు హరి ప్రసాద్ ఎమ్మార్పీఎస్ తదితరులు పాల్గొన్నారు.