04-03-2025 08:03:24 PM
టేకులపల్లి (విజయక్రాంతి): లైన్ మెన్ దివస్ రోజు సందర్భంగా టేకులపల్లి మండలం బొమ్మనపల్లి క్లస్టర్ పరిధిలోని సులానగర్లో పనిచేస్తున్న లైన్ మెన్ భూక్యా దేవ్ సింగ్ ను ఆ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సన్మానించారు. విద్యుత్ శాఖ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడి సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బొమ్మనపల్లి విద్యుత్ శాఖ ఏఈ బుజ్జి కన్నయ్య మాట్లాడారు. విద్యుత్ శాఖ ఆదేశాల మేరకు సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ ముందస్తు జాగ్రత్తలు, వాడవలసిన పరికరాలపై అవగాహన నిర్వహించి పరికరాలను అందజేశారు. విద్యుత్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తమ శాఖపై ఉందన్నారు. కార్మికుల యోగ క్షేమాల కొరకు కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి విద్యుత్ శాఖ సిబ్బంది వసీం పాషా, ఎస్ కే యాకూబ్, డి చరణ్, లచ్చు, భాష, ప్రవర్ధన్ కుమార్, ఏ.శ్రీనివాసచారి, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.