calender_icon.png 30 October, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జస్టిస్ లక్ష్మణరావుకు ఘన నివాళి

30-10-2024 12:42:46 AM

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): అలహాబాద్ మాజీ ప్రధాన న్యాయమూ ర్తి, ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూ ర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావుకు మంగళవారం హైకోర్టు ఘననివాళులు అర్పించిం ది. ఈ నెల 17న జస్టిస్ అంబటి లక్ష్మణరావు హైదరాబాద్‌లో మృతిచెందిన విషయం విదితమే.

ఆయన మృతికి ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే నేతృత్వంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు సమావేశమై నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, అడ్వొకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి న్యాయవ్యవస్థకు జస్టిస్ లక్ష్మణరావు అందించిన సేవలను కొనియాడారు.

కార్యక్రమంలో బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్‌కుమార్, పీపీ పల్లె నాగేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.