calender_icon.png 1 November, 2024 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ యోగికి ప్రెస్‌ క్లబ్‌లో ఘన నివాళి

10-08-2024 05:43:53 PM

వరంగల్: గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్ట్ యోగి, ఆయన కూతురు ఆద్య మృతదేహాలకు జర్నలిస్టులు ఘన నివాళులర్పించారు. శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న తొలివెలుగు యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ యోగిరెడ్డి అలియాస్ యోగి, ఆయన కూతురు ఆద్య మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శనివారం ఉదయం పొస్ట్ మార్టం జరిగింది. అనంతరం జర్నలిస్టుల సందర్శనార్థం ఇరువురి మృతదేహాలను ప్రత్యేక వాహనంలో గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

ఎంజీఎం మార్చూరి నుండి బయలుదేరిన వాహనం ముందు జర్నలిస్టులు జోహార్ యోగి, యోగి అమర్ రహే నినాదాలు చేస్తూ ఎంజీఎం సెంటర్ వరకు ర్యాలీగా వచ్చి రాజీవ్ గాంధీ సెంటర్లో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేసి నివాళులర్పించారు. అక్కడనుండి క్లబ్ కు తీసుకువచ్చారు. యోగి, ఆద్య మృతదేహాలను చూసి నివాళులర్పించేందుకు  జర్నలిస్టులు ప్రెస్ క్లబ్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, కార్యవర్గం మొదట ఇరువురి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

పలువురు జర్నలిస్టులు, బంధువులు యోగితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. అలాగే ఆద్య చదువుతున్న ఎస్‌ఎంఆర్‌ స్కూల్‌ యాజమాన్యం, టీచర్లు, కుడా మాజీ చైర్మన్‌ సుందర్‌ రాజు, బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌ రెడ్డి తదితరులు యోగి, ఆద్య మృతదేహాలకు నివాళులర్పించారు. వారి ఆత్మలకు శాంతికలగాలని 2 నిమిషాలు మౌనం పాటించి  శ్రధ్దాంజలి ఘటించారు. అనంతరం  క్లబ్ నుండి ఏకశిలా పార్క్ వరకు ర్యాలీగా వెల్లి ఇరువురి మృతదేహాలను జనగామ తరలించారు.

కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, పిన్నా శివకుమార్, పీవీ కొండల్ రావు, గడ్డం కేశవమూర్తి, బీఆర్ లెనిన్, వల్లాల వెంకటరమణ, గాడిపెల్లి మధు, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, కేకే, మస్కపురి సుధాకర్, శ్రీధర్రెడ్డి, శ్రీధర్, దుర్గాప్రసాద్, వేణు, రంజిత్, అశోక్, గొకారపు శ్యాం, బొడిగె శ్రీను, అల్లం రాజేశ్ వర్మ, పొడిచెట్టి విష్ణువర్థన్, వలిశెట్టి సుధాకర్, సంపెట సుధాకర్, వరప్రసాద్, అంజి,దిలీప్,సంజీవ్, రాజు, వేణుగోపోల్, తదితరులు, యూనియన్ల నేతలు, ప్రెస్ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.