28-04-2025 06:14:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ బ్రాంచ్ ఎల్ఐసి కార్యాలయం పరిధిలో అత్యధికంగా పాలసీలు చేసినందుకు గుర్తింపుగా ఇనుగుర్తి మండలం చిన్యాతండాకు చెందిన ఎల్ఐసి ఏజెంట్ జాటోత్ హరిచంద్ కు మై ప్రైడ్ ఎల్ఐసి పతకం అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బాలన్, ఏబిఎం ప్రేమ్ కుమార్, డీవో సాంబమూర్తి పాల్గొన్నారు.