calender_icon.png 10 March, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ స్పీకర్‌ శ్రీపాదరావుకు నివాళి

03-03-2025 12:00:00 AM

మెదక్, మార్చి 2 (విజయక్రాంతి): మాజీ  స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరంలో యువజన, క్రీడల అధికారి వె.దామోదర్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం  కలెక్టర్ శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజల కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు, క్రీడాకారులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.

కొమురవెల్లిలో...

మంథని, మార్చి 2 (విజయక్రాంతి) ః శ్రీపాదరావు 88వ జయంతి పురస్కరించుకొని సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం కామన్ వద్ద ఆదివారం భక్తులకు మంథని, కమాన్ పూర్, ముత్తారం, రామగిరి కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, రెబల్ రాజు,  మోతుకూరి అవినాష్, వినీత్ యాదవ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.