calender_icon.png 23 December, 2024 | 6:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటస్వామికి నివాళి

23-12-2024 01:41:00 AM

కామారెడ్డి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకట స్వామి వర్ధంతిని అధికారికంగా ఆదివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో నిర్వహించారు. వెంకటస్వామి చిత్రపటానికి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ మాట్లాడు తూ.. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా గడ్డం వెంకటస్వామి రాష్ట్ర ప్రజలకు అనేక సేవలందించారన్నారు.

దళిత, బడుగు బలహీన అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ జ్యోతి, వెంకట్‌రాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.