calender_icon.png 21 April, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి సీఆర్‌ఆర్‌కు నివాళి

07-04-2025 12:00:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): పేదల పెన్నిధి, జిల్లా ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేని మహానేత దివంగత చిలుకూరి రామచంద్రా రెడ్డి అని పలువురు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కురవృద్ధుడు,  మాజీమంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి (సి.ఆర్.ఆర్) జయంతి వేడుకలను ఆదిలాబాద్ లోని ఆయన స్వగృహంలో శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తదితరులు సి.ఆర్.ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్ళుఅర్పించిన తర్వాత,  కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

వారు చూపిన మార్గంలో నడు స్తూ ప్రతీ ఒక్కరు వారి ఆశయసాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావ్ పాటి, నాయకులు అంబకం టి అశోక్, సంజీవ్, చంద్రశేఖర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.