calender_icon.png 4 April, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఘన నివాళి

03-04-2025 05:01:04 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటం నైజాం ప్రభుత్వానికి, దొరలకు, జమీందార్లు, జాగీర్దార్లకు, దేశ్ముఖ్ లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 4 వేలమంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులైనారు. జమీందార్ జాగీరుదార్ల చెర నుండి అనేకమందిని విడిపించడమే గాక 10లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టులు పేదలకు పంచారని నాటి పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని ఆయన జయంతిని పురస్కరించుకొని ఇల్లందు సీపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏలూరి భవన్ లో దొడ్డి కొమరయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పింఛారు.

అనంతరం మన్యం మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా నాయకులు అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ... నాడు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా వేలాది మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడి దొరల కబంధ హస్తాల నుంచి ప్రజలను కాపాడారని అన్నారు. 10 లక్షల ఎకరాల భూమిని భూమీ లేని పేదలకు పంచారన్నారు. నాటి పోరాటంలో తొలిగా అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఆయన అమరత్వంతో పోరాటం మరింత ఉదృతంగా సాగిందని అందులో 4 వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలు అమరులైనారన్నారు. ఆ పోరాటంతో నైజాం దిగివచ్చి ఇండియన్ యూనియన్ కు లొంగిపోవడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, వజ్జ సురేష్, నాగరాజు, వీరయ్య, లక్ష్మీ నారాయణ, యాసిన్, మాచర్ల బిక్షపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.