07-02-2025 12:14:46 AM
కొల్చారం, ఫిబ్రవరి 6: మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వాళ్దాసు మల్లేష్ గౌడ్ ను గురువారం నాడు నర్సాపూర్ స్వగృహం లొ జిల్లా ప్రతినిధులు, మండల జర్నలిస్టులు కలిసి అయన ను శాలువాతో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల ఎప్పటికప్పుడు నిరసనలు తెలియజేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తారని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ గ్రామాన బీజేపీ అధిపత్యం కనబరుస్తామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష పదవుల ఎంపికకు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావుల సహకారం మరువలేని తెలిపారు.
నమ్మకంతో జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టిన భారతీయ జనతా పార్టీ అధిష్టానంకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. అధ్యక్షుని కలిసిన వారిలో జిల్లా ప్రతినిధులు రామకృష్ణ గౌడ్ నాగభూషణం మండల జర్నలిస్టులు అశోక్ గౌడ్, శ్రీధర్, లక్ష్మీనారాయణ గౌడ్, శివకుమార్, నర్సిములు రాజు,నవీన్ ,వంశీ, మండల బీజేపీ అధ్యక్షులు పంతులు హరీష్,లింగం తదితరులు ఉన్నారు.