calender_icon.png 1 March, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాబూరాజేంద్రప్రసాద్‌కు నివాళి

01-03-2025 01:03:40 AM

ఖమ్మం, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి ): ఉన్నత విలువలు ప్రదర్శించి దేశ, విదేశీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న  గొప్ప యోధుడు బాబూ రాజేంద్రప్రసాద్ చిరస్మరణీయుడు అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుకొనియాడారు.

జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి, ప్రముఖ స్వాతంత్య్రసమరయోధులు డాక్టర్ బాబురాజేంద్ర ప్రసాద్ 62 వ వర్ధంతి సందర్భo గా అయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మహనీయులు చూపిన బాటలో నడవటమే మనం వారికిచ్చే ఘన నివాళులని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వహక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా,సేవాదళ్, మైనారిటీ అద్యక్షులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,కార్పొరేటర్లు దుద్దుకూరి వేంకటేశ్వరరావు, రాపర్తి శరత్, కన్నం వైష్ణవిప్రసన్న, చామకూరి వెంకటనారాయణ, మాజి కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావు, జిల్లా ఓబీసీ సెల్ ఉపాధ్యక్షులు బమ్మిడి శ్రీనివాస్ యాదవ్, గజ్జి సూర్యనారాయణ, గజ్జెల్లి వెంకన్న, నగర ఓబీసీ,మైనారిటీ,ఎస్టీ సెల్ అద్యక్షులు బాణాల లక్ష్మణ్, షేక్ అబ్బాస్ భేగ్, శంకర్ నాయక్, భూక్యా సురేష్ నాయక్, ఆలే సాయికిరణ్, నూకారపు వెంకటేశ్వరరావు, నల్లమోతు లక్ష్మయ్య,రజి భాయ్, ఫరీద్ ఖాద్రి,బలుసు లక్ష్మి ,భవాని,ఊరుకొండ చంద్రిక,యూసఫ్, జాకీర్, గోపాల్, బొమ్మ ఉదయ్, పర్వత శ్రీనివాస్, షేక్ పాషా, జెర్రిపోతుల అంజనీ కుమార్, బచ్చలికూరి నాగరాజు,శేషురెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.