calender_icon.png 6 March, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్ మారథాన్ రన్నర్ కు సన్మానం

06-03-2025 07:41:31 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): ఇటీవల క్యాన్సర్ బాధితుల సహాయార్థం, పద్మశాలి సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో జరిగిన ఆఫ్ మారథాన్ 21 కిలోమీటర్ల పరుగును విజయవంతంగా పూర్తి చేసిన నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన జర్నలిస్ట్ గడబోయిన అశోక్ ను గురువారం ఖానాపూర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సట్ల శంకర్ మాట్లాడుతూ... నేటి యువత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఖచ్చితంగా వాకింగ్, రన్నింగ్, వ్యాయామం లాంటివి చేయాలన్నారు. ఆఫ్ మారథాన్ పరుగును విజయవంతంగా పూర్తి చేసిన అశోక్ బృందం ఈ ప్రాంతానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని అన్నారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.