వీరుడు దాశరథికి విప్లవ దండాలు
అమరుడు దాశరథికి అక్షర దండాలు
తెలంగాణ విముక్తే ధ్యేయంగా పోరినాడు
కలాన్ని ఖడ్గంగా ఝులిపించి తీరినాడు
నిజామోని పాలనపై నిప్పులు కురిపించినాడు
విప్లవాగ్ని రగిలించి వీరుడిగా నిల్చినాడు
రాజీ లేని పోరులోన పోరు తిలకమైనాడు
ధన్యజీవి దాశరథి కృష్ణమాచార్యులు
‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’నని
పెన్నుకు పదునెట్టి పాటలెన్నో రాసి
తెలంగాణ జన గుండెల్ని రగిలించి
మొండితనంతో నాడు ముందుండి నడిచాడు
పోరుగడ్డ చిరునామా తెలంగాణ అగ్నిధార
ధ్వజమెత్తిన ప్రజాగొంతు కవిసింహం దాశరథి
ఆస్థానకవిగానూ అలరించే భువిలో నా..
తెలుగుభాష నలుదిక్కులా వెలిగించినా కాగడా
జైల్లో పెట్టినా జంకనట్టి జగమొండి..
బొగ్గును కలముగ మార్చి నిగ్గదీసిన దిగ్గజం
జైలుగోడలపై నైజామును నినదించిన కరమై
పల్లెపల్లె జనంలోన చైతన్యం నింపినాడు
సాహితీ సేద్యానికి నిలువెత్తు సంతకమై
తెలుగుజాతి హృదయాల్లో గీతమై సాగినాడు
కళాప్రపూర్ణ రుద్రవీణ మహాకవి దాశరథి
జగమెరిగిన దాశరథికి అక్షర నివాళి అర్పిద్దాం!
గడ్డమీది చంద్రమోహన్ గౌడ్
9866510399