calender_icon.png 1 March, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలి

01-03-2025 12:59:52 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

మణుగూరు, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : మారుమూల ప్రాంతాలలో నివసించే గిరిజనులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రాణాంతకమైన వ్యాధులకు వైద్య పరీక్షలు చేయించుకోలేని గిరిజనుల సౌలభ్యం కొరకు ఈ మెగా హెల్త్ క్యాంపులు ఎంతో దోహద పడుతుందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ అన్నారు.  శుక్రవారం మణుగూరు మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన పగిడేరు  జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఐటీడీఏ,వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ పదకం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు.

శిబిరానికి వచ్చిన గిరిజన మహిళలతో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ కొండ కోనల్లో నివసించే ఆదివాసి గిరిజనులకు కార్పొరేట్ స్థాయిలో వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి దానికి సంబంధించిన మందులు అందజేసి ప్రమాదకరమైన జబ్బులను నయం చేయడానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో వివిధ భయంకరమైన జబ్బులకు సంబంధించిన ప్రత్యేక వైద్య నిపుణులచే వివిధ రకాల స్కానింగ్లు చేయించి రోగ నిర్ధారణ అయితే వాటికి సంబంధించిన మందులు అందజేయడం జరుగుతుందన్నారు.

ఈ శిబిరంలో గర్భిణీ  స్త్రీల ప్రత్యేక ప్రత్యేక స్కానింగ్,  సాత్విక కంటి కంటి పరీక్ష, చిన్నపిల్లల, చర్మవ్యాధి,  చెవి, గొంతు వైద్య నిపుణులచే  ఉదయం 10.00 గంటలనుండి 3 గంటలవరకు ప్రత్యేక వైద్య నిపుణులచే నిర్వహించడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ (61)మరియు అవసరమైన ల్యాబ్ టెస్ట్ చేయడం జరిగిందని, 460 మంది పేషెంట్లకు వివిధ రకాల వైద్య పరీక్షలు జరిపి సరిపడా మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ భాస్కర్, ప్రోగ్రాం అధికారి బాలాజీ, డాక్టర్లు నిశాంత్, సాత్విక, సంజీవరావు, విజయ్, రాజశేఖర్, విక్టర్, ఖిల్లా, శైలేష్ మరియు సిబ్బంది పాయం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, లింగా నాయక్, రాముడు, రవి, వెంకన్న, వాణి తదితరులు పాల్గొన్నారు