calender_icon.png 18 January, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనులకు మెరుగైన వైద్యసేవలందించాలి

18-12-2024 01:18:55 AM

  • యువ వైద్యులకు రాష్ట్రపతి ముర్ము పిలుపు
  • ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి హాజరు

అమరావతి, డిసెంబర్ 17: యువ వైద్యులు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు మెరుగైన వైద్యసేవ లందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో మంగళవారం నిర్వహించిన తొలి స్నాతకోత్స వానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్ర బాబునాయుడుతో కలిసి ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకున్న 49 విద్యార్థులకు పట్టాలు అందజేశారు.

అనంతరం రాష్ట్రపతి ప్రసంగిస్తూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం వైద్యులకు ఉందని, ప్రజారోగ్య సంరక్షణలో యువ వైద్యులు ముందుండాలని ఆకాంక్షించారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. దీనిలో భాగంగా ఎయిమ్స్‌కు మరో పదెకరాల స్థలం కేటాయిస్తామని ప్రకటించారు.