calender_icon.png 20 January, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో ఆదివాసీలు అభివృద్ధి చెందాలి

07-07-2024 02:24:42 AM

ఎస్పీ డీవీ శ్రీనివాస్

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూలై 6 (విజయక్రాంతి): ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీపీవోలో ఆదివాసీ సంఘాల నాయకులతో ఆత్మీయ సమ్మేళనం చేర్పాటు చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఆదివాసీలు ఉన్నత చదువులను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను ఆధిరోహించేలా పిల్లలను ప్రోత్స హించాలని పిలుపునిచ్చారు. గంజా యి, కల్తీ కల్లు గుడుంబా లాంటి చెడు అలవాట్లను మానుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ ఎల్లాప్పుడు ఆదివాసీల సమస్యలను పరిష్కరించేందుకు మందుంటుందని తెలిపారు. అనంతరం ఆదివాసీలకు భోజనం వడ్డించడంతోపాటు వారితో కలసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఎస్పీ సదయ్య, ఆదివాసి నాయకులు మడావి గుణవంత్‌రావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.