calender_icon.png 22 October, 2024 | 8:17 AM

ఆదివాసీల నిరసనలో ఉద్రిక్తత

22-10-2024 01:20:12 AM

ఆదిలాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): ఎన్నికల సమయంలో వరంగల్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ, ఆదివాసీ అనుబంధ సంఘాల ఆధర్యంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు చేపట్టిన ధర్నా అనంతరం ఆదివాసీలు ఒక్క సారిగా కార్యాలయంలోకి దూసుకొచ్చారు. గమనించిన డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు సిబ్బందితో ఆందోళనకారులను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు కలెక్టర్ రాజరిషాకు సమాచారం ఇవగా, కలెక్టర్ ఆదివాసీల వద్దకు వచ్చి వినతిపత్రం సీకరించారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ మాట్లాడుతూ.. ప్రభుతం రైతులకు ఎటువంటి షరతులు లేకుండా రైతురుణాలు వెంటనే మాఫీ చేయాలని, రైతు భరోసా, కింటాల్ పత్తికి 10 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూ సమస్యలను పరిష్కరి స్తామ న్న హామీని ప్రభుత్వం నెరవేర్చాలని డిమాం డ్ చేశారు. భూ సమస్యలు పరిష్కారం కానందున పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నిరస నలో తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.