రామచంద్రునాయక్
గిరిజనులు తండాలు ప్రకృతిని నమ్ముకుని నివసిస్తున్నారని ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్ అన్నారు. ఆత్మగౌరవం కోసం తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని గిరిజనులు కోరుకున్నారని, కానీ గత ప్రభుత్వం కోడిని వేలాడదీసి మాంసం తిన్నట్లుగా చేసిందని మండిపడ్డారు. తండాలను పంచాయతీలను చేసిందని, రెవెన్యూ పంచాయతీ చేయలేదన్నారు. టాక్స్‌లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.