calender_icon.png 10 January, 2025 | 1:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలిమెల తండాలో గిరిజనుల అరెస్టు

10-01-2025 12:00:00 AM

పటాన్‌చెరు, జనవరి 9 : రామచంద్రా పురం మండలం వెలిమెల గ్రామ తండాలో గిరిజనులను బీడీఎల్ బానూర్ పోలీసులు గురువారం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  కొన్ని రోజులుగా వెలిమెల తండాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొ న్నాయి. వెలిమెల రెవెన్యూ పరిధిలోని 434 సర్వేనంబర్ భూములతో పాటు సుమారు 60 ఎకరాల బినా దాఖలు భూ ముల్లో దాదాపు ఎనబై సంవత్సరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు.

కాగా తమను భయబ్రాంతులకు గురిచేస్తూ వేరే ఇతర వ్యక్తులు ఈ భూముల్లోకి వస్తుండడంతో ఆందోళనలు మొదలయ్యా యని  గిరజనులు చెప్పారు. ఈ భూముల పై హక్కుల కోసం ముప్పు సంవత్సరాల క్రితం హైకోర్టును ఆశ్రయించామని, హైకోర్టు తమకు అనుకూలంగా  ఇచ్చిన ఆర్డర్‌ను రెవెన్యూ అధికారులు అమలు చేయకుండా తొక్కిపెట్టారని చెప్పారు.

కొత్తగా రెండు, మూడు సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు రెవెన్యూ అధికారులు వారి పేర్ల మీద ఈ భూముల్లో నుంచి 25 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్‌లు  చేశారని గిరజనులు తెలిపారు. మిగత భూములను కూడా రిజిస్ట్రేషన్‌లు చేసుకు నేందుకు ఈ భూముల వద్దకు బడా వ్యక్తులు వస్తున్నారని, పోలీసులను పెట్టి తమను భయపెడుతున్నారని చెప్పారు. భూముల వద్దకు వెళ్లిన గిరిజనులు పది మందిని బీడీఎల్ భానూర్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.