calender_icon.png 13 March, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ 2 పరీక్షల్లో వికసించిన గిరిజన యువకుడు

12-03-2025 11:56:05 PM

పలు ఉద్యోగలు సాధించి గ్రామీణానికే వెన్నె తెచ్చిన భూక్యా రమేష్

టేకులపల్లి,(విజయక్రాంతి): కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చునని నిరూపించిన గిరిజన యువకుడు భూక్యా రమేష్. టేకులపల్లి మండలం కొత్త తండా గ్రామానికి చెందిన రమేష్ ఒక సాధారణ గిరిజన రైతు కుటుంబంలో  జన్మించాడు. అంచలంచెలుగా ఎదిగి ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాలలో 475 స్టేట్ ర్యాంక్, 370మార్కులు సాధించి పలువురి మన్ననలు పొందాడు.  గతంలో 2008-09 బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా, విఆర్ఓగా  2012-2022 పలు ఉద్యోగాలు సాధించి, గ్రామానికె వన్నె తెచ్చారు. భూక్యా రమేష్ సాధించిన, ఉద్యోగాలను బట్టి గ్రామస్తులు పలు రాజకీయ నాయకులు, ఆయనను అభినందించారు. ఈ. సందర్భంగా రమేష్ మాట్లాడుతూ యువత కష్టపడి చదువుతే ఏ ఉద్యోగమైన సాధించవచ్చు అన్నారు. గ్రామాల్లో స్వీట్లు పంచుకుని రమేష్ ను అభినందించారు.