అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీఓ రాహూల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల, గురులకులాలు, వసతిగృహాల్లో పనిచేస్తున్న ప్రధానోపాద్యాయులు, వర్డెన్లు, ప్రిన్సిపాల్స్, సబ్జెక్ట్ ఉపాధ్యాయులు, ఫ్యాకల్టీ కలిసికట్టుగా పనిచేస్తూ విద్యార్థీని విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిచడంతో పాటు, నాణ్యమైన విద్యను భోధించాలని ఐటీడీఏ పీఓ రాహూల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ కాన్పరెన్సు హల్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది పరీక్షా ఫలితాల కన్నా ఈ ఏడాది మెరుగైన పరీక్షా ఫలితాలు 100శాతం వచ్చేలా ప్రతి ఒక్కరు భాధ్యతగా తీసుకోవాలన్నారు. గిరిజన సంక్షేమశాఖ ప్రదాన కార్యదర్శి ప్రత్యేక సూచనలు, ఆదేశాల మేరకు గురుకులాలు, ఆశ్రమ పాఠశాల, వసతి గృ హాల్లో చదువతున్న గిరిజన విద్యార్థీని, విద్యార్థులకు చక్కటి విద్యతో పాటు మెనూ ప్రకారం తాజా కూరగాలయలతో సమయానుకూలంగా వారికి భోజన సౌకర్యం కల్పించి, ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహంచాలని ఆదేశించారు. వంట చేసే సిబ్బంది ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు.
నాసిరకమైన బియ్యం, కూరగాయలు ఏమైనా ఉంటే వాటిని వాడకుండా తాజాగా ఉన్న ఆహార పదార్దాలతో వంట చేసి ఉపాద్యాయులు, ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేసిన తర్వాతనే విద్యార్ధులకు వడ్డించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో నాసిరకమైన ఆహరం సరఫరా చేయడంతో నారాయణపేట, కొమరంభీం ఆసీఫాబాద్, మహాబూబ్‌నగర్ జిలల్లో పిల్లలు మంచినీరు, ఆహారం సరిగా లేక అస్వస్థతకు గురైన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేసి ఆలాంటి పరిస్తిథి రాకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, గిరిజన సంక్షేమశాక ప్రిన్సిపల్‌సెక్రటరీ గిరిజన సంక్షేమశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టినందున తగిన రీతిలో పనిచేసి చెడ్డపేరు రాకుండా చూడాలన్నారు.
కొన్ని చోట్లు ప్రదానోపాద్యాయుల అనుమతి లేకుండా పిలల్లు బయటకు వెళ్తున్నారని, కొన్ని చోట్ల 50శాతం కూడా విద్యార్థుల శాతం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారుల మద్య మానటరింగ్ లేక ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఇక ముందు అలా జరగకుండా చూడాలన్నారు. జీసీసీ సరఫరాల చేసే వస్తువులపై జాగ్రత్త పాటించాలన్నారు. నాసిరకంగా వస్తువులు ఉంటే వెంటనే తిప్పి పంపాలని ఆదేశించారు. టీచర్లకు ఎలాంటి డిప్యూటేషన్లు ఉండవని తేల్చి చెప్పారు. ఈ నాలుగు నెలలు పిలల్ల చదువుపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్‌వెల్పెర డీడీ మణెమ్మ, ఆర్‌సీఓ గురుకులం నాగార్జునరావు, డిఎంజీసీసీ సమ్మయ్య, ఏసీఎంఓ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.