calender_icon.png 22 November, 2024 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి పోటీలకు గిరిజన విద్యార్థులు

22-11-2024 03:20:42 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు క్రీడా అధికారి బండమీనారెడ్డి, క్రీడ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జంగు తెలిపారు. అమూల్య, ముత్తుబాయి, అనిత, మౌనిక ఈ నెల 25 నుంచి 29 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగే 68వ ఎస్ జి ఎఫ్ అండర్ 14 విభాగం హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొననున్నారు. అదేవిదంగా ఈ నెల 25వ నుంచి 30వ తేది వరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని లక్నోలో జరిగే ఎస్ జి ఎఫ్ అండర్ 17 విభాగం అథ్లెటిక్స్ జాతీయ స్థాయి పోటీలకు నందిని పాల్గొననుంది. హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ శిక్షకులు విద్యాసాగర్, అరవింద్ లను, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిణిలను గిరిజన సంక్షేమ శాఖ డిడి రమాదేవి, ఏసీఎంవో ఉద్ధవ్, జి సి డి ఓ శకుంతల, ఏటీడీవో చిరంజీవి, కోచ్ లు తిరుమల్, వార్డెన్ సాయిబాబా, సీనియర్ క్రీడాకారులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.