calender_icon.png 9 January, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రైబల్ మ్యూజియం పనుల్లో వేగం పెంచాలి

31-12-2024 03:16:33 AM

అధికారులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 30 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో నిర్వహించే ముక్కోటి ఏకాదశి సమీపిస్తున్న నేపథ్యంలో ట్రైబల్ మ్యూజియం పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం  ఐటీడీఏ ప్రాంగణం లోని ట్రైబల్ మ్యూజియం పనులను ఆ యన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 9, 10 వ తేదీల్లో సీతారాముల తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం జరుగుతున్న నిర్వహిస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో హాజరవు తారని చెప్పారు.

వారు తప్పనిసరిగా ట్రైబల్ మ్యూజియాన్ని సందర్శించేలా భద్రాచలం పట్టణంలోని ముఖ్య కూడళ్లలో, మ్యూజి యం ఎదురుగా స్వాగత బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు మ్యూజియం సందర్శించడానికి వచ్చినప్పుడు సంప్రాదాయక దుస్తులు ధరించిన మహిళలు స్వాగతం పలికేలా ఏర్పాటు చేయాలన్నారు.

మ్యూజి యంలో ఆదివాసీలకు సంబంధించిన పాతకాలపు ఇండ్ల నిర్మాణంలో కొండరెడ్ల కుటుం బాల గృహోపకరణాలు(సామాన్లు) అమర్చాలని, పర్యాటకులు సెల్ఫీ దిగేలా ఏర్పా టు చేయాలని పీవో రాహుల్ ఆదేశించారు. ఆయనవెంట సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ తానాజీ, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి మణెమ్మ, ఎఫ్‌డీసీ ఉదయ్ కుమార్, ఐటీసీ జీఎం చంగల్‌రావు ఉన్నారు.