calender_icon.png 3 April, 2025 | 1:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖులను ఆకట్టుకునే విధంగా గిరిజన మ్యూజియాన్ని తీర్చిదిద్దాలి

01-04-2025 12:00:00 AM

ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, మార్చి 31 (విజయక్రాంతి) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, పట్టాభిషేకం ఏర్పాట్లను ప్రముఖులు సందర్శించే అవకాశం ఉన్నందున తప్పకుండా గిరిజన మ్యూజియాన్ని తిలకించడానికి వచ్చే సూచనలు ఉన్నందున ట్రైబల్ మ్యూజియము ప్రముఖులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.  సోమవారం ఐటిడిఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంను ఆయన సందర్శించారు.

మ్యూజియంలో సందర్శకుల కొరకు ఏర్పాట్లు చేసిన వివిధ కళాఖండాలను, పెయింటింగ్ చిత్రాలను మరియు చివరి దశలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులకు గిరిజన వంటకాల కోసం నిర్మాణం చేపడుతున్న స్టాల్స్ ఈరోజు సాయంత్రం వరకు పూర్తిస్థాయిలో నిర్మాణం కంప్లీట్ అయిపోయి విద్యుత్ కనెక్షన్ కూడా పూర్తి కావాలని, పాతకాలపు ఇండ్లలో సందర్శకులు కూర్చోవడానికి అనుకూలంగా టేబుల్స్, కుర్చీలు ఏర్పాట్లు చేయాలని, గిరిజన తెగలకు సంబంధించిన సాంప్రదాయ దుస్తులు అందుబాటులో ఉంచాలని, మ్యూజియం లోపలికి ప్రవేశించ గానే పర్యాటకులకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఆర్‌ఓ ప్లాంట్ మరియు రిసెప్షన్ కౌంటర్ ఏర్పాట్లు చేయాలని, క్రీడల కోసం ఏర్పాటు చేస్తున్న బీచ్ వాలీబాల్ మరియు మ్యూజియం చుట్టూ పూర్తి స్థాయిలో భూమిని రేపు సాయంత్రం వరకు శుభ్రం చేయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏపీవో పవర్ వేణు, డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, స్పోరట్స్ అధికారి గోపాలరావు, టీఏ శ్రీనివాస్, ఏ ఈ రవి, జిపిఈఓ శ్రీనివాస్, మ్యూజియం ఇంచార్జ్ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.