26-03-2025 03:13:44 PM
భద్రాచలం,(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం పోస్టర్(Tribal Museum Poster)ను తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ... భద్రాచలంలో ఆదివాసీ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు ట్రైబల్ మ్యూజియం కీలక భూమిక పోషిస్తుందని, దీనివల్ల స్థానిక గిరిజన సాంస్కృతిక సంపదను భవిష్యత్ తరాలకు అందించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), మట్ట రగామాయి (సత్తుపల్లి), కోరాం కనకయ్య (ఇల్లందు), రాందాస్ నాయక్ (వైరా)తో పాటు కాంగ్రెస్ జిల్లా నాయకులు సాధు రమేష్ రెడ్డి, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ పాల్గొన్నారు.