calender_icon.png 3 April, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 6న ట్రైబల్ మ్యూజియం ప్రారంభోత్సవం

02-04-2025 08:48:13 PM

ఐటీడీఏ పీవో రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): ఐటీడీఏ ప్రాంగణంలో సర్వసుందరంగా అలంకరించిన ట్రైబల్ మ్యూజియం ఈనెల 6న ప్రారంభిస్తున్నందున సంబంధిత ఐటిడిఏ యూనిట్ అధికారులు అందరూ అందుబాటులో ఉండి ప్రారంభత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం రాత్రి ట్రైబల్ మ్యూజియంలోని కార్యాలయంలో యూనిట్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు అంతరించి పోకుండా వాటి పరిరక్షణకు ప్రత్యేకంగా ఈ మ్యూజియంను చూపరులకు ప్రతిబింబించేలా అన్ని హంగులతో ముస్తాబు చేశామని అన్నారు.

ఇంకా ఏమైనా మ్యూజియమునకు సంబంధించిన పనులు మిగిలి ఉంటే పూర్తి చేసుకోవాలని, సంబంధిత యూనిట్ అధికారులు వారి శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా జిసిసి, అగ్రికల్చర్ సంబంధించిన ఉత్పత్తులను ప్రారంభించే రోజున మ్యూజియంలో ఏర్పాటు చేసి వాటి యొక్క వివరాలు సందర్శకులకు అర్థమయ్యే రీతిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని తెగల కల్చర్కు సంబంధించిన కళాఖండాలు, పెయింటింగ్ చిత్రాలు, పాతకాలపు వస్తువుల సేకరణ, మ్యూజియమును ముస్తాబు చేయడానికి ఐటీడీఏ యూనిట్ అధికారులు మరియు సిబ్బంది కృషి ఉందని వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఏవో సున్నం రాంబాబు, ఎస్ఓ ఉదయభాస్కర్, ఎఫ్ డిఓ ఉదయ్ కుమార్, ఏసి ఎం రమణయ్య, ఏటిడిఓ అశోక్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, పివిటిజి అధికారి నరేష్, ఏపీవో పవర్ వేణు, డిఎం జిసిసి సమ్మయ్య, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మ్యూజియం ఇంచార్జి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.