calender_icon.png 26 March, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి

24-03-2025 03:33:28 PM

గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ నాయక్ 

సింగరేణి కాలనీలో గిరిజన సంఘాల నాయకుల ఆందోళన 

ఎల్బీనగర్: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేయాలని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ నాయక్, గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సింగరేణి కాలనీ చౌరస్తాలో సోమవారం సుధీర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... హస్తినాపురం కార్పొరేటర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులో సుధీర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేయకపోతే త్వరలో వేలాది మందితో డీసీపీ ఆఫీస్ ముట్టడిస్తామని,  నేషనల్ ఎస్సీ, ఎస్టీ కమిషన్, నేషనల్ మహిళా కమిషన్ కు ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు అశోక్ రాథోడ్ కొర్ర లక్ పతి నాయక్ , బాబురామ్ నాయక్, శంకర్ నాయక్, రాజు రాథోడ్, గిరిజన మహిళలు పాల్గొన్నారు