calender_icon.png 27 April, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవి సెలవుల్లో గిరిజన హాస్టళ్లకు మరమ్మతులు చేయించాలి

26-04-2025 05:31:28 PM

ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా...

మహబూబాబాద్ (విజయక్రాంతి): వేసవి సెలవుల్లో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో టాయిలెట్లు, డైనింగ్ ఆల్, పైకప్పులు, కాంపౌండ్ వాల్, మైనర్, మేజర్ రిపేర్లను చేపట్టి విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఐటిడిఏ పిఓ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా ముత్యాలమ్మ గూడెం గిరిజన ఆశ్రమ పాలికోన్నత పాఠశాలను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ... హాస్టళ్ళు, విద్యాలయాలకు చెందిన హెడ్మాస్టర్లు, వార్డెన్లు ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుని, విద్యాలయాలు, వసతి గృహాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డిడి దేశి రామ్, హెడ్మాస్టర్ కోటేశ్వరి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.