calender_icon.png 15 April, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో ఆదివాసి సంఘాల ఐక్య సమావేశం

13-04-2025 10:41:12 PM

పాల్గొన్న అన్ని సంఘాల నాయకులు

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో  అఖిలపక్ష సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆదివాసి సంఘాల జేఏసీ అధ్యక్షులు పాయం సత్యనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  చందా లింగయ్య దొరతో పాటు మాజీ సీనియర్ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య  కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్ల, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వట్టం నారాయణ దొర, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు పోడియం బాలరాజు, గిరిజన సంఘం నాయకులు కుంజ సీతారాములు, రాష్ట్ర మన్నే సీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు గొప్ప వీరయ్య, ఆదివాసి అడ్వకేట్ పాయం రవి వర్మ , సిపిఐ పార్టీ స్టేట్ నాయకులు బి అయోధ్య, సిపిఎం పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, న్యూ డెమోక్ర జాతీయ నాయకులు కెచ్చల రంగారెడ్డి, మహిళా సంఘం నాయకురాలు కల్పన, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పుల్లారెడ్డి గిరిజన అభ్యుదయ సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కుర్సం సుబ్బారావు, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందేబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, ఆదివాసి వికాస్ పరిషత్ రాష్ట్ర నాయకులు కొమరం లక్ష్మణ్ రావు, పశువుల  బుచ్చయ్య, భద్రాచలం ఆదివాసి సమితి పూనెం కృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి వట్టo కన్నయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు పూనెం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

1) ఏజెన్సీ ట్రైబ్స్ 2950 లో డిక్లరేషన్ చేసిన ఆదివాసిలను ఒక గ్రూపు గా ఉంచాలని,

2) మైదాన ప్రాంత గిరిజనులు-లంబాడా ఎరుకల యానాది తదితరులు ఒక గ్రూపు గా ఉంచాలని,

 3) ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.  

అంతేకాకుండా సమావేశం ఆమోదించిన తీర్మానాలను పోరాటం చేసి సాధించుటకు రాష్ట్రస్థాయిలో ఆదివాసి అఖిలపక్ష ప్రజాసంఘాల పేరుతో ఉద్యమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమం నిర్వహించుటకు  సమన్వ కొర్తగా  చందా లింగయ్య దొర నియమిస్తూ ఏగ్రీవంగా తీర్మానించారు. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రస్థాయి మేధోమధనం సదస్సు నిర్వహించాలని కూడా ఈ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో చందా లింగయ్య దొర, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య, తాటి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మొత్తం నారాయణ దొర, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు పోడియం బాలరాజు, గిరిజన సంఘం నాయకులకు కుంజా  సీతారాములు రాష్ట్ర మన్నే సీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు గొప్ప వీరయ్య, ఆదివాసి అడ్వకేట్ పాయం రవి వర్మ, గిరిజన అభ్యుదయ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కుర్సం సుబ్బారావు, ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణ లక్ష్మయ్య, ఆదివాసి వికాస పరిషత్ రాష్ట్ర నాయకులు కొమరం లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు పూనం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.