calender_icon.png 12 January, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన రైతు ఆత్మహత్యాయత్నం

01-08-2024 01:12:41 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): జిల్లాలో వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా చెందిన అజ్మిర రాజు అనే వ్యక్తి. అటవీ భూమిని దున్నకుండ సంబంధిత అధికారులు అడ్డుకుంటున్నారంటూ గిరిజన రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గ్రామానికి చెందిన గిరిజన రైతు అజ్మీరా రాజు గ్రామ శివారులోని అటవీభూమిని సాగు చేయడానికి సిద్ధ మయ్యాడు. బుధవారం ట్రాక్టర్ తో దున్నడానికి వెళ్తుండగా సమాచారం అందుకున్న బీట్ అధికారి కిరణ్ ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకుని   అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తుండగా..  తన కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకున్నారు. బీట్ అధికారి కిరణ్,  రాజు, అతని కుటుంబ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రతీసారి సాగు చేయకుండా ఇబ్బంది చేస్తున్నారంటూ మనస్తాపం చెందిన రాజు పురుగుల మందు తాగి ఆత్మ హత్య యత్నం చేసుకున్నాడు. స్థానికులు 108 అంబులెన్స్ ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తరలించి చికిత్స పొందుతున్నాడు.