24-03-2025 08:53:50 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల ఆదివాసీ సంఘం నేతృత్వంలో గత వారం రోజులుగా వేపలగడ్డ గ్రామంలో జరుగుతున్న ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ టోర్నమెంట్ సోమవారంతో ముగిసింది. ఈ టోర్నీలో ప్రథమ బహుమతి కోమరంభీం టీమ్ వేపలగడ్డ టీం గెలవగా, ద్వితీయ బహుమతి మహేష్ టీమ్-కోయగూడెం, తృతీయ బహుమతి విఐపీ స్టార్స్ వేపలగడ్డ టీంలు గెలుచుకున్నాయి. ఈ బహుమతులను నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ మండల అధ్యక్షులు తాటి సత్యనారాయణ, వేపలగడ్డ మాజీ సర్పంచ్ కుంజా చిన్నబ్బాయి, ఉప్పసాక మాజీ సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, నకిరిపేట మాజీ సర్పంచ్ సర్పా వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు తాటి వెంకటేశ్వర్లు, కుంజా కృష్ణ, ఎడమ రామారావు, మాజీ వార్డు సభ్యులు కుంజా రాంబాబు, మేనేజ్మెంట్ సభ్యులు మెండి భాస్కర్, దనసరి శ్రీను, బొర్రా వీర్రాజు, తాటి రామారావు, కాకా రవి, స్థానిక ఆదివాసీ యువత కుంజా ప్రవీణ్ కుమార్, షకీల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.