calender_icon.png 31 January, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ

31-01-2025 12:00:00 AM

ఆందోల్ జనవరి 30 : చౌటకూర్ మండలంలోని బొమ్మ రెడ్డి గూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి రాత్రి వేళలో ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా  ఆశ్రమ పాఠశాలలో డైనింగ్ హాల్, కిచెన్ షెడ్డు స్టోర్ రూమ్లను విద్యార్థుల గదులను అందులోని మౌలిక సదుపాయాలను  కలెక్టర్ పరిశీలించారు.

విద్యార్థులకు నూతన మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన భోజనం అందించాలని వార్డెన్ శుభకు ఆదేశించారు. భోజన విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించిన సహించేలేదని  సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి  తెలుసుకున్నారు.కొత్త ఆరో ప్లాంటు,  టాయిలెట్స్ వంటి సౌకర్యాలు అవసరమని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరి క్రాంతి హామీ ఇచ్చారు.  విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి కోసం లక్ష సాధన దిశగా నిరంతరం శ్రమించాలన్నారు.

అనంతరం జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అఖిలేష్ రెడ్డి పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులతో విద్యాబోధన అంశాలపై చర్చించారు. రాత్రి పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిద్రించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ శోభ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.