రామాయంపేట: రామాయంపేట పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. కళాశాలకు చెందిన విద్యార్థినిలు పలు రకాల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, హిమజ్యోతి విద్యార్థులు వేసిన ముగ్గులను పరిశీలించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని సూచించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభాను ముగ్గుల రూపంలో బయటకు తీయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యాపకురాలు శ్రీదేవి, మంగా ఉన్నారు.