calender_icon.png 16 January, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రయాంగిల్ లవ్ స్టోరీ!

16-01-2025 03:37:15 AM

* పుప్పాలగూడ జంటహత్య కేసులో సంచలన ట్విస్ట్‌లు 

*  ఇద్దరు యువకులతో మహిళ వివాహేతేర సంబంధం!

*  విషయం తెలియడంతో ప్రేయసి, మరో వ్యక్తిని 

* హతమార్చిన ప్రియుడు

రాజేంద్రనగర్, జనవరి15: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి ఆలయ సమీపంలో వెలుగుచూసిన జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ట్రయాంగిల్ లవ్‌స్టోరీనే హత్యలకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాలు.. మంగళవారం ఉదయం మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాలగూడలోనిఅనంతపద్మనాభ స్వామి ఆలయగుట్ట వద్ద స్థానికులు రెండు మృతదేహాలను గుర్తించి నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్, రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ క్లూస్ టీం, డాగ్‌స్కాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

ఓ యువతి, యువకుడి మృతదేహాలను గుర్తించారు. కేసు దర్యాప్తులో భాగంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తూ డీసీపీ శ్రీనివాస్ ఆదేశాలు జారీచేశారు. దర్యాప్తులో మృతులను బిందు దివాకర్(25), అంకిత్ సాకేత్(25)గా పోలీసులు గుర్తించారు. బిందు దివాకర్ వనస్థ  పీఎస్ పరిధిలో భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఈమె మధ్యప్రదేశ్ వాసి. అంకిత్‌సాకేత్‌ది ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు నానక్‌రాంగూడలో ఉంటూ స్థానికంగా హౌస్   పనిచేస్తున్నాడు. బిందుకు, అంకిత్ సా  మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. 

భర్త, పిల్లలను వదిలేసి.. 

ఈ క్రమంలో ఈనెల 3న బిందు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంకిత్ సాకేత్ 8న మిస్సింగ్ కావడంతో గచ్చిబౌలి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బిందు.. భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడు అంకిత్ వద్దకు వచ్చింది.

అయితే బిందు అంకిత్‌తోపాటు మరో యువకుడితో ప్రేమ వ్యవహారం జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈనెల 11న అంకిత్ బిందును తనవద్దకు పిలిపించుకొని తన స్నేహితుడి గదిలో ఉంచాడు. మరుసటి రోజు పుప్పాలగూడ కొండల వద్ద ఏకాంతంగా గడిపారు.

అయితే, వారిద్దరు సన్ని  ఉన్నప్పుడు చూసిన బిందు మరో ప్రియుడు తీవ్ర ఆగ్రహానికి గురై వారిద్దరిని కత్తితో విచక్షణారహితంగా దాడిచే  పాటు బండరాళ్లతో మోది దారుణంగా హత్యచేసి పరారైనట్లు తెలుస్తోంది. అయితే ఈ హత్యోదంతంలో ఒకరే పాల్గొన్నారా.. అంతకంటే ఎక్కువ మంది పాల్గొన్నారా.. అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.