calender_icon.png 13 December, 2024 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్

13-12-2024 12:26:20 PM

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ ప్రారంభం అయింది. మల్కాపూర్ చెరువులో నీటిలో తేలియాడే యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ తిలకించడానికి ఓడీఎఫ్ అధికారులు, స్థానికులు తరలివచ్చారు. ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లను తయారు చేశారు. ట్రయల్ రన్ తర్వాత యుద్ధ ట్యాంకర్లు సైన్యానికి అప్పగించనున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏటా సైన్యానికి యుద్ధ ట్యాంకర్లను అందిస్తోంది.