సంగారెడ్డి అర్బన్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో శుక్రవారం యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ నిర్వహించారు. కంది మండలం ఏ వి ఎన్ హైదరాబాద్ కర్మాగారంలో వీటిని తయారు చేశారు. ఆయుధ కర్మాగారం అధికారులు, ఇండియన్ ఆర్మీ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ కొనసాగింది. నీటిలో తేలియాడుతూ పరుగులు తీయడం వాహనాల ప్రత్యేకత అని ఆయుధ కర్మాగారం చీఫ్ జనరల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. తమ కర్మాగారం నుంచి ప్రతి సంవత్సరం 120 వాహనాలను ఇండియన్ ఆర్మీకి సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. నాణ్యమైన యుద్ధ ట్యాంకర్లను ఆర్మీకి అందజేస్తున్నామని తెలిపారు.