calender_icon.png 22 November, 2024 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి కాళేశ్వరంపై విచారణ

22-11-2024 12:57:01 AM

హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ కమిటీ విచారణ శుక్రవారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. పీసీ ఘోష్ గురువారం సాయంత్రం కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రెండు వారాలపాటు విచారణ జరగనున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు ప్రాజెక్టులో పనిచేసిన ఇంజినీరింగ్ అధికారులు, రిటైర్ట్ ఇంజినీర్లను విచారించిన కమిషన్.. నేటి నుంచి ఐఏఎస్ అధికారులను బహిరంగ విచారణకు పిలువనున్నట్లు సమాచారం. వీరి విచారణ అనంతరం గత ప్రభుత్వంలోని ముఖ్య ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.