calender_icon.png 22 October, 2024 | 11:10 PM

ట్రెండీ రెయిన్ కోట్స్!

18-06-2024 12:05:00 AM

వానకాలం వచ్చేసింది.. వారం రోజుల నుంచి జల్లులు మనల్ని తడుపుతూనే ఉన్నాయి. వర్షపు చినుకుల నుంచి తప్పించుకొని బయటకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు కదా. చిరు జల్లుల్లో తడవకుండా.. హాయిగా, కంఫర్టబుల్‌గా ఉండే రెయిన్ కోట్స్‌ను మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఈ సీజన్‌లో  రెయిన్ కోట్లకు బాగా డిమాండ్. అందులోనూ కొత్తగా వస్తున్న ట్రెండీ, ఫ్యాషనబుల్ రెయిన్‌కోట్లు యూత్‌ను మరింత ఆకర్షిస్తున్నాయి.

అమ్మాయిల కోసం అచ్చం కుర్తీలా కనిపిస్తాయి. రంగురంగుల్లో రకరకాల డిజైన్లతో చూడగానే ఆకట్టుకునేలా ఉంటున్నాయి. కుర్తీల తరహాలో అందంగా ఉన్నాయి. పొడవు చేతులున్నవీ, రెక్కల తరహాలో.. ఇలా రకరకాలు ఉంటున్నాయి. పార్టీ వేర్ తరహాలో కనిపించే రెయిన్ కోట్లు వేసుకుంటే వానకు తడిసినా మెరుపులా మెరిసిపోవడం ఖాయం. మరెందుకు ఆలస్యం ఓ సారి మీరు ట్రై చేసి చూడండి..!