calender_icon.png 7 January, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రెండ్ హెయిర్ స్టెల్స్

04-01-2025 12:00:00 AM

కాలం మారింది.. కాలంతో పాటు ట్రెండ్ కూడా మారిపోయింది.. చిన్నతనం నుంచే హెయిర్ స్టయిల్స్‌ను ఫాలో అయిపోతున్నారు పిల్లలు.  ప్రత్యేకంగా కనిపించాలంటే ప్రజెంట్ జుట్టు ఎంత తక్కువ ఉంటే అంత క్రేజ్.. సైడ్ మొత్తం ట్రిమ్ చేసి.. తలపైన మాత్రం కాస్త జుట్టు ఉంచుతున్నారు హెయిర్ స్టయిల్ డిజైనర్స్. లేదంటే ఏ సినిమా హీరోనో.. స్టార్ క్రికెటర్ నో ఫాలో అవుతున్నారు. రింగురింగుల జుట్టో.. సిల్కీ హెయిరో.. నచ్చినట్టుగా మార్చేసుకుంటూ అదే ట్రెండ్ అంటున్నారు. మరి అలాంటి కొన్ని హెయిర్ స్టయిల్స్‌పై ఓ లుక్కేద్దాం..

రెండో ప్రపంచయుద్ధ సమయంలో క్రూ కట్ చాలా ఫేమస్. 1970లో దానికి డిమాండ్ తగ్గి, లాంగ్ హెయిర్ స్టయిల్స్‌కి డిమాండ్ పెరిగింది. అయితే ఆ తర్వాత 1980లో క్రూ కట్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మనదేశంలో ఈ మధ్య బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా క్రూ కట్ కి ఫిదా అయిపోయారు. ఇది చూడ్డానికి కొంచెం ఆర్మీలుక్ తరహాలో ఉంటుంది. 

క్లాసిక్ స్టయిట్ న్యూ: స్టయిట్ జుట్టు ఉన్న వారికి చాలా హెయిర్ స్టుల్స్ ఉంటాయి. ఈ రకం జుట్టుతో వివిధ రకాల కట్‌లు చేసుకోవచ్చు. అయితే ట్రెండీగా, కూల్‌గా ఉండే ఈ క్లాసిక్ కట్ ఉద్యోగం చేసే వాళ్లకి మాత్ర మే బాగుంటుంది. చిన్నపిల్లలకు నప్పుతుంది. అమా యకంగా, ఆకర్షణీయంగా కనిపించడమే దీని స్పెషాలిటీ. 

మిడ్-లెంత్ మెస్సీ: ఈ రకం హెయిర్ కట్ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. సింపుల్‌గా సూపర్‌గా కనిపించాలంటే ఈ హెయిర్ స్టయిల్ బెస్ట్ ఆప్సన్.

ఇండక్షన్ కట్: గల్లీ బాయ్ లుక్స్ కావాలనుకునే వాళ్లు ఈ ఇండక్షన్ కట్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీన్ని తలపైన చర్మం కనబడేలా ట్రీమ్ చేస్తారు. 

అండర్ కట్: తలకు రెండు వైపులా ట్రీమ్ చేసి జుట్టును షార్ట్ లెంత్‌లో ఉంచడమే అండర్ కట్. 1920,30లలో ఈ అండర్ కట్ ఫుల్ ఫేమస్. తర్వాత నెమ్మదిగా ఈ స్టయిల్ సెలబ్రిటీలను తాకింది. ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హమ్ అండర్ కట్‌లోకి మారాక ప్రపంచవ్యాప్తంగా ఈ స్టయిల్‌కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత విరాట్ కోహ్లి, ఫుట్ బాల్ స్టార్ క్రిస్లెనో రోనాల్డోలు అండర్ కట్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. 

మెస్ట్ అప్ పొంపాడోర్: ఈ స్టయిల్ కట్‌లో మాస్టర్ కూల్‌గా మెరిసిపోవచ్చు. చాలా కూల్‌గా ఉండే ఈ మోడల్ కట్ అండర్ కట్ మోడల్స్‌లో ఒకటి నీట్‌గా దువ్వకుండా మెస్ట్‌గా ఉంచడమే దీని స్పెషాలిటీ. దీనిలో రిలాక్స్ పొంపాడోర్ కూడా ఒక మోడల్. 

అండర్కట్ ఫేడ్: సైడ్ షేన్‌తో పాటుగా ఉండే ఈ అండర్ కట్ హెయిర్ స్టయిల్స్ ప్రస్తుతం ఎక్కువమంది యువకులు ఫాలో అవుతున్నారు. హెయిర్ లైన్ నుంచి లైట్‌గా షేవ్ చేస్తూ.. పై భాగంలో పొడవుగా వదిలిపెడతారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి అంటున్నారు హెయిర్ స్టయిల్ డిజైనర్స్.