06-04-2025 12:19:49 AM
జాజుల శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల 2న జరిగిన బీసీ గర్జన సభతో కేంద్రం లో వణుకు మొదలైందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి కోవాలని సూచించారు. శనివారం బీసీ సంఘాల నేతలతో క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఢిల్లీలో బీసీ జన గర్జన సభ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల చివరి వారంలో హైదరాబాదులో 29 రాష్ట్రాల ప్రతినిధులతో జాతీయ బీసీ ప్లీనరీ నిర్వహిస్తామని, మే రెండో వారంలో 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్‌లో బీసీ యుద్ధభేరి బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.
సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ బిసి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ దుర్గయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాం ప్రభు, మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు స్వర్ణ గౌడ్ సంధ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు .