calender_icon.png 7 February, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలేరు రాజకీయాల్లో ప్రకంపనాలు

07-02-2025 12:00:00 AM

ప్రభుత్వ విప్ పై మాజీ విప్ ఆరోపణలతో అలజడి 

ఐలయ్య చుట్టూ భూ కబ్జా 

బాగోతం అంటున్నా సునీత 

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) : ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పై మాజీ విప్పు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హైదరాబాద్ మీడియా సమావేశంలో చేసిన భూ కబ్జాల కామెంట్స్ ఆలేరు రాజకీయాల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. గతంలో కొలనుపాక భూకబ్జా భాగోతాన్ని.

తాజాగా ఆలేరు రెవెన్యూ తండాల్లో భూ దందాలు, అసైన్డ్ భూములతో వ్యాపారం చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. గిరిజనుల భూములపై ఐలయ్య కన్నేసి భూ దందా చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడు తున్నారని ఆరోపించారు. అసైన్మెంట్ సీలింగ్ భూములను అక్రమంగా కొంటూ తన బంధువు వర్గానికి అంటగడుతూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు.

త్వరలో ఆయన భూదందాలను ఒక్కొక్కటిగా బయటపెడ తామని హెచ్చరించారు. ఈ ఆరోపణలు ఆలేరు కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ పార్టీల కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఆలేరు ఎమ్మెల్యేగా గెలిచే వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులే వారంతా అధికారంలోకి రాగా నే భూదందాలను బినామీ పేర్ల తో కొన సాగిస్తూ ప్రభుత్వ, పేదల అసైన్డ్ భూములపై కన్నేసి అక్రమంగా కొంటూ భూ దందాలు చేస్తూ వస్తున్నారు.

గత 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా కొనసాగిన వారంతా రియాల్టర్ లే వారందరిపై కూడా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు అక్రమంగా కొనుగోలు చేశారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. తాజా విప్పి పై మాజీ విప్పి చేసిన ఆరోపణలు రాజకీయాల్లో వేడిని పుట్టించాయి.