calender_icon.png 19 October, 2024 | 3:55 PM

వణికిస్తున్న జ్వరం.. మంచం పట్టిన జనం!

28-07-2024 03:52:01 AM

  1. ఎక్కడ చూసినా జ్వర బాధితులే 
  2. బెంబేలెత్తిస్తున్న డెంగ్యూ జ్వరం 
  3. కామారెడ్డి జిల్లాలో 25 డెంగ్యూ కేసులు 

కామారెడ్డి, జూలై 27 (విజయక్రాంతి): జిల్లా ప్రజలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. ఎక్కడ చూసినా విష జ్వరాల బాధి తులే కనిపిస్తున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా సీజనల్ వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం తోపాటు గ్రామాలకు గ్రామాలు విష జ్వరాల బారిన పడి ప్రజలు బాధపడుతున్నారు. గ్రా మాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీ వైద్యుల వద్ద బారులు తీరుతున్నారు. అయినా తగ్గని వారు పట్టణాలకు వచ్చి ప్రవేట్ వైద్యులను సం ప్రదిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటు న్నారు. దీం తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ రోగుల సం ఖ్య అమాంతం పెరిగింది. నెల రోజుల క్రితం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ కోసం 200 మంది రోగులు వస్తే ప్రస్తుతం రోజుకు 8౦౦ వరకు చేరింది. పాఠశాలలకు వెళ్లిన చిన్నారులకు విష జ్వరాలు సోకుతున్నాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకుండా ఇంటి వద్ద చికిత్స చేయిస్తున్నారు. 

25కు చేరిన డెంగ్యూ కేసులు

మూడు నెలల క్రితం జిల్లాలో కేవలం 5 డెంగ్యూ కేసులు నమోదు కాగా శుక్రవారం నాటికి 25 కేసులు జిల్లా వ్యాప్తంగా  నమోదయ్యాయి. లింగంపేట మండలంలో 10 డెంగ్యూ కేసులు వెలుగు చూశాయి. మండల కేంద్రంలోనే ఆరు కేసులు, మెంగారం, పొల్కంపేట గ్రామాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. జుక్కల్, కొమలంచ, హన్మాజీపేట్, బీర్కూర్, పాల్వంచ, ఎల్లారెడ్డి, కామారెడ్డిలో మరో 10 కేసులు నమోదయ్యాయి. ప్రభు త్వ, ప్రైవేట్ దవాఖానల్లో విషజ్వరాల బారిన పడిన వారు చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగం హడావిడీ చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం అడుగులు ముందు కు వేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ జిల్లాలోని వైద్యాధికారులకు సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం దిశ నిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో మురుగు కాల్వలను శుభ్రం చేయడం, వాటర్ ట్యాంకుల  క్లోరినేషన్ చేయడం వంటి పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలను నిధుల కొరత వెక్కిరిస్తుంది. దీంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి.

చినుకు పడితే చిత్తడి  

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అపరిశుభ్రత తాండవం చేస్తోంది. మురుగు కాలువలు సరిగా లేక రోడ్లపైన డ్రైనేజీ నీరు ప్రవహిస్తుంది. చిన్న వానకే రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. వాటర్ ట్యాంకులు, తాగునీటి పథకాలు, బోర్ల చుట్టూ మురుగు చేరడంతో మంచినీరు కలుషితం అవుతోంది. ప్రభుత్ంవ నుంచి ఆశించిన నిధులు రాకపోవడంతో పంచాయతీలు, పట్టణాల్లో అపరిశు భ్రత నెలకొంది. దీంతో సీజనల్ వ్యాధులు పంజా విసురుతున్నాయి. డయేరియా పేరిట జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. లింగంపేట్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బీర్కూర్, నస్రూల్లాబాద్, హన్మాజీపేట్, మెంగారం, పోల్కంపేట్, పాల్వంచ తదితర పీహెచ్‌సీల్లో డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. బాన్సువాడ మండలం బొర్లం గ్రామంలో చిన్న,పెద్ద తేడా లేకుండా విష జ్వరాలతో బాధ పడుతున్నారు.