భద్రాచలంలో పోస్టర్ విడుదల చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
భద్రాచలం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) ః తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు.అపర భగీరధులు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న తెలంగాణ రాష్ర్టంలో హరితసేన ఆధ్వర్యంలో వృక్షార్చన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్క గులాబీ సైనికుడు కేసీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటాలని తెలంగాణని హరితవనం గా మార్చాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వృక్షార్షన వాల్ పోస్టర్లను స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం బిఆర్‌ఎస్ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, హరితసేన నియోజకవర్గ నాయకులు కీసర యువరాజు నాయకులు గుంజ ఏడుకొండలు, అయినాల రామకృష్ణ, ఇమంది నాగేశ్వరరావు, రోహిత్ పాషా, లంకపల్లి విశ్వనాద్ తదితరులు పాల్గొన్నారు.